పట్టణంలో నేడు టీఎల్ఎం మేళా

MBNR: జడ్చర్ల బాయ్స్ జడ్పీహెచ్ఎస్‌లో నేడు మండల స్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించనున్నారు. డీఈవో ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేళాలో జడ్చర్ల మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభ, సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఈవో తెలిపారు.