వరదలు తగ్గుముఖం పట్టే వరకు వాగు దాటొద్దు: సీఐ

BDK: అశ్వాపురం మండలం గొందిగూడెం కొత్తూరు ఎలకల గూడెం మధ్య ఇసుకవాగు ఉదృతిగా ప్రవహిస్తుండడంతో శనివారం ఉదయం అశ్వాపురం సీఐ జి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాదాలు జరుగకుండ ముందస్తుగా చర్యలు చేపట్టారు. ప్రజల రాకపోకలను నిలిపివేశారు. సిబ్బందితో ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ పర్యవేక్షిస్తున్నారు. వరదతగ్గు ముఖం పట్టేవరకు వాగు దాటవద్దని ప్రజలకు తెలిపారు.