VIDEO: గొలుగొండలో లోయలో పడ్డ ఆటో.!
AKP: గొలుగొండ కొత్త జోగంపేట వద్ద ఆదివారం ఓ ఆటో ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఆటోలో కొత్తమల్లంపేట గ్రామస్తులు ప్రయాణిస్తున్నారని సమాచారం. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి ఎక్కువగా గాయాలయ్యాయి. వీరంతా కోటవురట్ల మండలం మల్లవరానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు.