మాజీ సర్పంచ్‌కు ఎమ్మెల్యే రూ. 5 లక్షల సాయం
NGKL: లింగాల మండలం అప్పాయిపల్లి మాజీ సర్పంచ్ భోజయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితిపై స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రూ.5 లక్షల ఎల్బీసీ (LOC) మంజూరు చేయించారు. స్థానిక ప్రజాప్రతినిధులు చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్యే చొరవపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.