రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

MDK: మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామానికి చెందిన అల్లాడి నిఖిల్ (22) మృతి చెందాడు. మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.