ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే

RR: సమాజంలో మీడియా పాత్ర ఎంతో గొప్పదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం హాజిపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో మీడియా కూడా కీలకమని, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.