ఏనుగుల దాడి.. పంటల ధ్వంసం

ఏనుగుల దాడి.. పంటల ధ్వంసం

CTR: కుప్పం మండలం N. కొత్తపల్లి పంచాయతీ పరిధిలో వ్యవసాయ పంటలను రెండు ఏనుగులు ధ్వంసం చేశాయి. నాలుగు రోజుల క్రితం రామకుప్పం మండలంలో సంచరించిన గజరాజులు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి. ఇక్కడే తిరుగుతూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టమాటా, వరి పంటలు ధ్వంసమైనట్లు బాధిత రైతులు వాపోయారు.