ఇచ్చోడలో మారుమోగిన శివాజీ నామస్మరణ

ఇచ్చోడలో మారుమోగిన శివాజీ నామస్మరణ

ADB: ఇచ్చోడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యువక మండలి, శివాజీ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా భారీ శోభాయాత్ర నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.