VIDEO: చోరీకి పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

VIDEO: చోరీకి పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

ప్రకాశం: కొమరోలు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య తెలిపారు. గిద్దలూరు రూరల్ సీఐ కార్యాలయం వద్ద మంగళవారం సీఐ మాట్లాడుతూ.. ఒకే గ్రామానికి చెందిన నిందితులు చెడు అలవాట్లకు బానిసలై తీగల చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అందిన ఫిర్యాదుతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.