పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

MDK: చిలిపి చేడ్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రతి పోలీసు అధికారి ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో కీలకపాత్ర పోషించాలని అక్కడి సిబ్బందికి సూచించారు.