గుట్కా షాపులు తొలగించాలని ఫిర్యాదు

గుట్కా షాపులు తొలగించాలని ఫిర్యాదు

ADB: విద్యా సంస్థల సమీపంలో గుట్కా, సిగరెట్ల విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు, కాలేజీల వద్దే దుకాణాలు కొనసాగుతున్నాయని వన్ టౌన్, టూ టౌన్ సీఐలకు ఫిర్యాదు చేశారు. వీటివల్ల విద్యార్థులు చెడు అలవాట్లకు లోనవుతూ భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.