భార్యపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టేందుకు యత్నం

భార్యపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టేందుకు యత్నం

GNTR: భార్యపై కిరోసిన్ పోసి భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళగిరి గ్రామీణ పోలీసుల వివరాల ప్రకారం.. చినకాకానిలో భువనేశ్వరి రాజశేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు. మంగళవారం మద్యం మత్తులో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. మద్యం సేవించి తనను ఇబ్బంది పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.