రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRNL: గూడూరు సబ్ డివిజన్ పరిధిలో కోడుమూరు, గూడూరు, సి. బెళగల్ ఫీడర్ల పరిధిలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిప్యూటీ EE జేసన్ శుక్రవారం తెలిపారు. అన్ని 33/11 కే.వీ సబ్ స్టేషన్ లలో ఫీడర్‌లో మరమ్మతులు నిర్వహించనున్నందున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.