తిరుపతిలో వృద్ధురాలి దారుణ హత్య

తిరుపతిలో వృద్ధురాలి దారుణ హత్య

తిరుపతిలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కొరమేనుగుంట సీపీఆర్ అర్బన్ అపార్ట్మెంట్, ప్లాట్ నంబర్ 202లో ధనలక్ష్మి (73) తన సోదరుడు షణ్ముగంతో కలిసి ఉంటోంది. వీరికి కేర్ టేకర్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన రవి పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఇవాళ ఉదయం ధనలక్ష్మిని ఎవరో కత్తితో గొంతు కోసి ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మాయం చేశారు.