తడి-పొడి చెత్తపై అవగాహన
VSP: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా మధురవాడ జోన్ పరిధిలోని పీఎంపాలెంలో పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 6వ వార్డు జీవీఎంసీ కమ్యూనిటీ హాల్‌లో వాష్, సహాస్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో సుమారు 110 మంది కార్మికులు పాల్గొన్నారు. అలాగే తడి-పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పించారు.