VIDEO: రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్
MLG: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గోవిందరావుపేట (M) పస్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్సా సదుపాయాలు, మందుల అందుబాటు, శుభ్రత వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన, త్వరిత వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.