VIDEO: వరదలకు నీట మునిగిన పంటలు

W.G: ఎగువున కురుస్తున్న వర్షాలకు నక్కల కాలువకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నక్కల కాలువ సమీపంలోని ఆచంట మండలం వేమవరంలో నారు మడులు వేసుకున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది కాలువకు వచ్చే వరద నీరు పంట పొలాలు మునుగుతున్నాయన్నారు. నక్కల కాలువకు మరమ్మతులు చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.