సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలంటూ నిరసన

సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలంటూ నిరసన

NLR: సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలంటూ కావలి స్థానిక 33, 34వ వార్డు మహిళలు ప్రజలు నిరసనకు దిగారు. గాదంశెట్టి విజయ్ అనే వ్యక్తి తన భవనంపై సెల్ టవర్ నిర్మిస్తున్నారని తెలుసుకున్న స్థానిక ప్రజలు నిర్మాణం ఆపాలంటూ విజయ్ నివాసానికి వెళ్లి ప్రశ్నించగా విజయ్ దురుసుగా మాట్లాడారని వాపోయారు. దీంతో స్పందించిన టౌన్ ప్లాన్ అధికారి వివేక్ పోలీసుల సహకారంతో టవర్ నిర్మాణాన్ని ఆపారు.