VIDEO: భక్తులతో కిక్కిరిసిన సలేశ్వరం క్షేత్రం
NGKL: 'తెలంగాణ అమర్నాథ్'గా పేరొందిన సలేశ్వరం క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. లింగాల మండలంలో జరుగుతున్న ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా, బుధవారం వేలాది మంది భక్తులు కఠినమైన లోయల గుండా కాలినడకన ప్రయాణించి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీగా తరలిరావడంతో అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగింది.