భక్తి భావాన్ని అలవర్చుకోవాలి: ఆడే గజేందర్
ADB: ప్రజలందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో మనిషి ప్రవర్తనలో సైతం మార్పు కలుగుతుందని పేర్కొన్నారు.