VIDEO: జూదంపై డ్రోన్ ఆపరేషన్
విశాఖ-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూపేష్‌నగర్‌లో జూదం జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు డ్రోన్ సాయంతో దాడి నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో జూదం ఆడుతున్న నలుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలం నుంచి ముగ్గురు పరారయ్యారు. ఈ మేరకు ఏపీ పోలీస్ గేమింగ్ చట్టం సెక్షన్ 9(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.