ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కృష్ణా: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ‘ప్రజా దర్బార్’ కార్యక్రమమని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్’ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.పెడన పట్టణ టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి, పరిష్కారానికి తగు చర్యలు తీసుకున్నారు.