లిక్కర్ కేసు.. విచారణ వాయిదా

లిక్కర్ కేసు.. విచారణ వాయిదా

ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టులో వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. ఈ కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. రాజ్ కసిరెడ్డి నేరానికి పాల్పడ్డారని ప్రాథమికంగా ఆధారాలున్నాయని ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.