జనగాంలో రెండో విడత నామినేషన్లకు ఐదు క్లస్టర్లు
జనగాం మండలంలో గ్రామ పంచాయతీల రెండో విడత నామినేషన్ల స్వీకరణ కోసం అధికారులు ఆదివారం ఐదు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 21 గ్రామాల నామినేషన్లు స్వీకరించేందుకు ప్రత్యేక బందోబస్తు కల్పించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు, సీఐ సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.