రానున్న 2-3 గంటల్లో జిల్లాలో వర్షం

రానున్న 2-3 గంటల్లో జిల్లాలో వర్షం

BHNG: జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రానున్న 2-3 గంటల్లో జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.