‘ఏజెన్సీలో అక్రమ పట్టాలు రద్దు చేయాలి’

‘ఏజెన్సీలో అక్రమ పట్టాలు రద్దు చేయాలి’

MLG: వెంకటాపురం మండల కేంద్రంలో ఇవాళ గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సాయి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ మండలాల్లో గిరిజనేతరులకు జారీ చేసిన అక్రమ పట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చట్ట వ్యతిరేకంగా జరిగిన ఈ పట్టాలను వెంటనే రద్దు చేసి, గిరిజనుల హక్కులను కాపాడాలని ఆయన కోరారు.