కూచిపూడి SIగా శిరీష
కృష్ణా: కూచిపూడి పోలీస్ స్టేషన్‌కు ఎస్సైగా పీ. శిరీష గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆమెకు ఆహ్వానం పలుకుతూ పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ మేరకు శిరీష మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిర్మూలన, ప్రజలకు త్వరిత న్యాయం అందించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.