VIDEO:'పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి'

HNK: హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నేతల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకొని విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.