చోరీ కేసును ఛేధించిన పోలీసులు
జనగామ: మండలం పసరమడ్ల గ్రామంలో మార్చి 31న గందమాల రవీందర్ ఇంట్లో తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన గందమాల భానుప్రకాష్, మిద్దెపాక భరత్‌లను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నిందితుల వద్ద నుంచి 2 బంగారు ఉంగరాలు, 115 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.