రెండోసారి తల్లి కాబోతున్న హీరోయిన్

రెండోసారి తల్లి కాబోతున్న హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ రెండోసారి తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్‌తో పింక్ డ్రెస్‌లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. కాగా, 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ పెళ్లి చేసుకున్న సోనమ్.. 2022లో కుమారుడికి జన్మనిచ్చింది. ఆ బాబుకు 'వాయు' అనే పేరు పెట్టారు.