నాడు జడ్పీ వైస్ ఛైర్మన్.. నేడు సర్పంచ్ అభ్యర్థిగా..!
సిరిసిల్ల: వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేటకు చెందిన తీగల రవీందర్ గౌడ్ గతంలో ఉమ్మడి జడ్పీ వైస్ ఛైర్మన్‌గా, ఇంఛార్జ్ ఛైర్మన్‌గా పనిచేశాడు. అయితే ఈసారి మరోసారి సర్పంచ్‌గా బరిలోకి దిగుతూ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కీలక పదవులు చేపట్టినా గ్రామాభివృద్ధికే ప్రాధాన్యమిస్తానని ఆయన పేర్కొనడం గమనార్హం.