గెయిల్ కంపెనీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయిస్తాం: ఎంపీ
కోనసీమ: నగరం గ్రామానికి గెయిల్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యతను తాము తీసుకుంటామని అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ తెలిపారు. నగరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి శనివారం మీడియాతో మాట్లాడారు. రూ.6 కోట్లు గెయిల్ నిధులతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిందన్నారు. వీటితో పాటు గ్రామానికి గెయిల్ ఇచ్చిన మరో 10 హామీలు కూడా అమలు చేయిస్తామన్నారు.