గ్రూప్-1పై అప్పీలుకు వెళ్లాలని TGPSC నిర్ణయం

TG: గ్రూప్-1పై హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని TGPSC నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లనుంది. ఈ మేరకు ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పేపర్లు మళ్లీ దిద్దితే సాంకేతిక సమస్యలు వస్తాయని భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.