మహా అన్నసమారాధనలో పాల్గొన్న సిరమ్మ

మహా అన్నసమారాధనలో పాల్గొన్న సిరమ్మ

విజయనగరంలోని బాబా మెట్టలో డబల్ కాలనీలో శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన మహా అన్నసమారాధనకు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ హాజరయ్యారు. ముందుగా ఆలయ పూజారి పుష్కర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమలో భక్తులు పాల్గొన్నారు.