ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
NRPT: పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గురువారం ఉదయం స్వామివారి దర్శనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రానేష్ చారి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేసి చిట్టెంను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కవితతో పాటు BRS నాయకులు పాల్గొన్నారు.