21న మరిడిమాంబ పండుగకు ఏర్పాట్లు

AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం సీహెచ్.నాగాపురం, పాతకృష్ణదేవిపేటలో 21న శ్రీమరిడిమాంబ అమ్మవారి పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ నేపథ్యంలో ఆయా ఆలయాలను రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా విద్యుత్ అలంకరణ చేస్తున్నారు. పండుగ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.