'కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు'

MNCL: హైదారాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్‌పై దాడిని నిరసిస్తూ మంగళవారం మంచిర్యాలలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక కేసులో ప్రతివాదులు న్యాయవాది శ్రీకాంత్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చేయి విరగొట్టారని తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.