రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NRML: సోన్‌ మండలంలోని పాక్ పట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్(30) తన ఇంటి సమీపంలో ఉన్న రహదారి పక్కనే కూర్చొని మరోవ్యక్తితో మాట్లాడుతున్నాడు. అదే రహదారిపై వెళ్తున్న ఓ బైక్ అదుపుతప్పి వీరిని ఢీకొంది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, శ్రీనివాస్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు.