అయ్యో పాపం.. 4 నెలల బాలుడి మృతి

అయ్యో పాపం.. 4 నెలల బాలుడి మృతి

NLG: దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి బాలుడు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాలు.. గుర్రంపోడుకు చెందిన తిరుపతి లింగయ్య- అలివేలు దంపతులకు రెండో కాన్పులో కుమారుడు జన్మించాడు. 4 నెలల వయసుగల బాలుడు రెండు రోజులుగా పాలు తాగడం లేదని హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా మృతి చెందారని వారు తెలిపారు.