లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
HNK: కటాక్షపూర్ శివారులో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక కథనం మేరకు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ములుగు వైపు వెళుతున్న కారు అదపుతప్పి రోడ్డుపై నిలిపివున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న రాకేష్ మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలు కావడంతో స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.