ఢిల్లీలో వాయు కాలుష్యం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. అక్కడ గాలి విషపూరితంగా మారుతోంది. దీంతో ఢిల్లీ వాసులు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.