ఆగస్టు 14న జిల్లాస్థాయిలో ప్రాచీన, గ్రామీణ క్రీడా పోటీలు

శ్రీకాకుళం: ఆగస్టు 14న జిల్లాస్థాయి ప్రాచీన గ్రామీణ క్రీడలు పోటీలు నిర్వహిస్తామని డీఎస్‌డీఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఏర్పాటై 75 ఏళ్లైన సందర్భంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు కోడి రామమూర్తి క్రీడా ప్రాంగణంలో పురుషులు, మహిళలకు కర్రసాము పోటీలు ఉంటాయన్నారు. సంగిడి, ముద్దార్, పిల్లిమొగ్గలు కేవలం పురుషులకు మాత్రమేనని చెప్పారు.