VIDEO: రాఘవేంద్ర మఠంలో భక్తుల రద్దీ
KRNL: తుంగభద్రా నది తీరంలో వెలసిన పుణ్యక్షేత్రం రాఘవేంద్ర స్వామి మఠం భక్తులతో కోలాహలంగా మారింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మధ్వ కారిడార్, అన్న ప్రసాద, పరిమళ ప్రసాద, నదీతీర ప్రాంతాలలో భక్తులతో సందడిగా నెలకొంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది.