TTD ఉద్యోగులకు నోటీసులు

TPT: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి ఘటనలో సిట్ విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా పలువురు ఉద్యోగులను విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఇద్దరు ఉద్యోగులను సిట్ విచారణకు అధికారులు అనుమతి కోరగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్, ల్యాబ్ విభాగాల ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.