VIDEO: దేవస్థానానికి నెలలో రూ.1.49 కోట్ల ఆదాయం
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 30 రోజుల్లో హుండీ ద్వారా రూ.38,73,858 ఆదాయం లభించింది. వివిధ ఆర్థిక సేవా టికెట్ల ద్వారా రూ.1,10,54,223 సమకూరగా, మొత్తం ఆదాయం రూ.1,49,28,081 వచ్చింది. అలాగే మిశ్రమ వెండి, బంగారాన్ని సీల్ చేసి హుండీలో భద్రపరిచినట్లు ఈవో సుధాకర్ తెలిపారు.