టీడీపీ మాజీ మండల కన్వీనర్ ఇంట్లో విషాదం

టీడీపీ మాజీ మండల కన్వీనర్ ఇంట్లో విషాదం

ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన టీడీపీ మాజీ మండల కన్వీనర్ రామచంద్ర యాదవ్ సతీమణి గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గుత్తి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆమె భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి సంతాపం వ్యక్తం చేశారు.