ఘనంగా ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన

ఘనంగా ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన

KMM: కొణిజర్ల మండల పరిధిలోని మంగాపురం గ్రామంలో ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు.  గ్రామంలో నూతనంగా గుడి నిర్మాణానికి అనుమోలు రాధిక లక్ష రూపాయల విలువ చేసే స్థలాన్ని వితరణ చేశారు. గ్రామ సర్పంచ్ నూనావత్ శ్రీను రూ.50 వేలతో బోరు వేయించారు. సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో గుడి నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు.