జిల్లాలో 110 మంది వైద్యశాఖ ఉద్యోగుల బదిలీలు

KRNL: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 110 మంది ఉద్యోగులను బదిలీ చేసినట్లు డీఎంహెచ్ డాక్టర్ పి. శాంతికళ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీ అయిన వారు రేపు మధ్యాహ్నం రిలీవ్ అయి 23వ తేదీ లోపు కొత్త స్థానాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఎంపీహెచ్ డ్రైవర్లు హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆఫీస్ సిబ్బంది సహా వివిధ విభాగాల ఉద్యోగులు బదిలీ అయ్యారు.