పరిశ్రమల ఖిల్లాగా ఉమ్మడి మెదక్

పరిశ్రమల ఖిల్లాగా ఉమ్మడి మెదక్

ఉమ్మడి మెదక్ జిల్లా పరిశ్రమల ఖిల్లాగా.. ఉపాధి కల్పించే కేంద్రంగా విరాజిల్లుతోంది. 1980 నుంచే పారిశ్రామిక ప్రస్థానం ప్రారంభం కాగా గుండసూది నుంచి రాకెట్ విడిభాగాల తయారీ వరకు ఎదిగింది. సుమారు 6,472 పరిశ్రమల్లో 4.5 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. సంగారెడ్డి, జహీరాబాద్ వంటి ప్రాంతాల్లో నూతన పారిశ్రామిక వాడలు విస్తరిస్తూ అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి.