VIDEO: మార్కాపురంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
ప్రకాశం: మార్కాపురంలో ఆదివారం స్థానిక వైసీపీ ఇంఛార్జి అన్నారాంబాబు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేదలు విద్య, వైద్యం కోల్పోతారని, వెంటనే ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.